మోడీ మెచ్చిన ప్రేమకథ..!

192
Prime Minister Narendra Modi hails Akshay Kumar
- Advertisement -

స్వచ్చభారత్ అభియాన్‌ స్పూర్తితో తీసిన సినిమా టాయిలెట్:ఏక్ ప్రేమ్ కథా.. ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ ట్రైటర్‌కు 24 గంటల్లోనే కోటీ 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోపాటు దేశాన్ని ద‌శాబ్దాలుగా ప‌ట్టిపీడిస్తున్న ఓ స‌మ‌స్య‌పై సందేశాన్ని ఇవ్వ‌డ‌మే ల‌క్ష్యంగా తెర‌కెక్కించిన ఈ సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ప‌రిశుభ్ర‌త‌పై ఇదో మంచి సందేశం, స్వ‌చ్ఛ భార‌త్ కోసం 125 కోట్ల మంది ఒక్క‌టి కావాలి అని మోదీ అన్నారు. టాయిలెట్ ట్రైల‌ర్‌ను మోదీకి అక్ష‌య్ ట్వీట్ చేసిన త‌ర్వాత ప్ర‌ధాని ఈ విధంగా స్పందించారు.

ఇక కథలో చాలా విషయం ఉందని ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది. కేశవ్ (అక్షయ్) మరియు జయ (భూమి) రెండు ప్రక్క ప్రక్కన గ్రామాలకు చెందిన యువతీ యువకులు. ప్రేమలో పడతారు. పెళ్ళి చేసుకుంటారు. తీరా ఫస్ట్ నైట్ అయిన తరువాత.. హీరో చెల్లెలు వచ్చి.. లోటాల పండగ (పబ్లిక్ లో టాయిలెట్ కు ఈ ఊరి అమ్మాయిలతో తొలిసారి వెళ్లే పండగ)కు రమ్మని పిలుస్తుంది. అప్పుడు విస్తుపోయిన హీరోయిన్.. మీ ఇంట్లో టాయిలెట్ కట్టిస్తేనే వస్తాను.. లేకపోతే రాను అని పుట్టింటికి వెళిపోతుంది. ఆమె కోసం హీరో ఏం చేశాడు.. తులసి మొక్కలు నాటుకుని పూజ చేసే చోటనే బాత్రూమ్ కట్టుకోమంటారా అనే మెంటాలిటీ ఉన్న గ్రామస్థుల మైండ్ సెట్ ఎలా మార్చాడు అనేదే కథ. ఈ మధ్యకాలంలో మనం విద్యాబాలన్ చేసిన గవర్నమెంట్ యాడ్ ఒకటి ఇటువంటి కథాంశంతోనే చూశాంగా.. సేమ్ అదే తరహాలో ఈ సినిమా అంతా ఉంది.ఈ సినిమా ట్రైలర్ ఫన్నీగా ఉంది కాని. ఈ మధ్య కాలంలో అక్షయ్ కుమార్ భారీ హిట్లు అందుకున్నాడు మరి ఈసినిమా ఏరెంజ్‌లో ఉండబోతుందో మరి.

- Advertisement -