తెలంగాణ అమరుల త్యాగాలను, జ్ఞాపకాలను, పోరాటాలను గుర్తుచేసుకుంటూ నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని మహేశ్ బిగాల గుర్తుచేశారు. ఆ రోజు కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమ గతిని మార్చేసిందని అన్నారు. ఆ సమయంలో తెలంగాణ సమాజం యావత్తు కేసీఆర్ వెంట నిలవడంతో కేంద్రం మెడలు వంచి చివరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించగలిగామని తెలిపారు. వీటన్నింటినీ గుర్తుచేసుకుంటూ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రపంచ దేశాల్లోనూ దీక్షా దివస్ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
ఎమ్మెల్సీ కవితని హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో మహేశ్ బిగాల మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే రోజుల్లో పార్టీపరంగా బలోపేతం చేయడం, వివిధ అంశాలపై చర్చించారు.
Also Read:NRI BRS:యూకే నూతన అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి