రేవంత్ రెడ్డి నియంతలా పాలిస్తే నడవదు అన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి సోదరుల వేధింపులు తట్టుకోలేక, ఆయన సొంత ఊరులో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు…రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజువా? చక్రవర్తివా? నీలాంటి చాలా మంది కొట్టుకుపోయారు, నువ్వు కూడా కొట్టుకుపోతావ్ అని హెచ్చరించారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాత్ ద్వారా కలిశారు.కేటీఆర్ వెంట పట్నం నరేందర్ రెడ్డి భార్య, శ్రీనివాస్ గౌడ్, మహముద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి ఉన్నారు.
ఇక లగచర్లలో అధికారుల కార్యక్రమంలో రైతులు దాడి చేశారంటూ బొంరాస్పేట పోలీసులు మూడు ఎఫ్ఐఆర్లను ఎందుకు నమోదు చేశారో పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
ALso Read:కాంగ్రెస్ అబద్దాలను కడిగేసిన కాగ్