ఆస్ట్రేలియా 104 ఆలౌట్‌

1
- Advertisement -

పెర్త్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ (26), అలెక్స్ క్యారీ(21) లు రాణించగా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫ‌లం అయ్యారు. భారత బౌలర్లలో జ‌స్‌ప్రీత్ బుమ్రాకు 5 వికెట్లు ద‌క్క‌గా, హ‌ర్షిత్ రాణాకు 3 వికెట్లు, మ‌హ్మ‌ద్ సిరాజ్ రెండు వికెట్లు ద‌క్కాయి. టెస్టుల్లో బుమ్రా 5 వికెట్లు తీసుకోవ‌డం ఇది 11వ సారి.

ఓవ‌ర్ నైట్ స్కోరు 67/7 తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ మ‌రో 37 ప‌రుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. అంత‌క‌ముందు టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే.

Also Read:Ind Vs Aus:150 పరుగులకే టిమిండియా ఆలౌట్

- Advertisement -