డిసెంబర్ 9 నుండి అసెంబ్లీ సమావేశాలు

3
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా ఆర్ ఓ ఆర్ చట్టాన్ని ఆమోదించనుంది అసెంబ్లీ. అలాగే రైతు, కుల గణన సర్వే పై చర్చించే అవకాశం ఉంది.

మహారాష్ట్ర ఫలితాల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉండనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 7 తో రేవంత్ సర్కార్ కు ఏడాది పూర్తి కావొస్తుండగా ఆ లోపే మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది.

అలాగే పంచాయతీ ఎన్నికలపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఎన్నికలకు ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read:BRS:గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు అనుమతి

- Advertisement -