మెట్లు ఎక్కండి…ఇలా బరువు తగ్గండి!

4
- Advertisement -

ఈ మధ్యకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు పెరగడం. తినే ఆహారంలో మార్పుల కారణంగా కొద్దిగా తిన్నప్పటికి విపరీతంగా బరువు పెరుగుతుంటారు. బరువు పెరిగిన తర్వాత తగ్గేందుకు వారు పడే శ్రమ అంతా ఇంత కాదు. గంటల తరబడి వ్యాయామం, జిమ్‌కు వెళ్లడం లాంటివి చేస్తుంటారు. అయితే రిజల్ట్ కొద్దిగా కనిపించినా లాంగ్ టర్మ్‌లో ఫలితం మాత్రం శూన్యం.

అయితే తాజాగా ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయం వెల్లడైంది. బరువు తగ్గేందుకు మెట్లు ఎక్కడం ఉత్రమ మార్గమని తేలింది. మెట్లు ఎక్కడం వల్ల శరీరంలోని కీలక కండరాలపై ఎక్కువ ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మెట్లు ఎక్కడం వల్ల నిమిషానికి సుమారుగా 8 నుంచి 11 కేలరీలు కరిగే అవకాశం ఉంది. ప్రతిరోజు మెట్లు ఎక్కడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చని తేలింది.

వారంలో ఐదురోజుల పాటు సుమారు 30 నిమిషాలు మెట్లు ఎక్కడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం అనేది టెక్నిక్, నిలకడపైనా ఆధారపడి ఉంటుందని తెలిపారు. మూడు నిమిషాల పాటు మెట్లు ఎక్కి తర్వాత విశ్రాంతి ఇవ్వాలి ఆ తర్వాత మళ్లీ మెట్లు ఎక్కడం ప్రారంభించాలి… ఇలానే రిపీట్ చేస్తూ మొత్తంగా 30 నిమిషాలు చేస్తే ఫలితం ఉంటుందని తెలుస్తోంది.

Also Read:డిసెంబర్ 20న అల్లరి నరేష్.. ‘బచ్చల మల్లి’

- Advertisement -