ఐడియా ఆఫర్‌ అదిరిందోచ్‌..@ 70జీబీ డేటా..!

201
On Rs. 396 Recharge, Idea Offers 70 GB Data For 70 Days
- Advertisement -

ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాల్ ఆఫర్ తో టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. జియో దెబ్బతో మిగతా టెలికాం కంపెనీలన్ని కుదేలైపోయాయి.  దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన టెలికాం కంపెనీలు అనివార్యంగా ఆఫర్లను ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది.

అందులో భాగంగానే ఇప్పుడు ఐడియా కూడా ఆఫర్ల తో ముందుకొస్తుంది. ఇప్పటికే పలు ఆఫర్లని ప్రకటించిన ఐడీయా, ఇప్పుడు మళ్ళీ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.
On Rs. 396 Recharge, Idea Offers 70 GB Data For 70 Days
తాజాగా ఐడియా సెల్యులార్‌ తన వినియోగదారుల కోసం ఓ బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రీపెయిడ్‌ కస్టమర్లు రూ.396తో రీఛార్జ్‌ చేసుకుంటే 70జీబీ డేటాను పొందవచ్చు. దీనిని 70 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. డేటాతో పాటు 3,000 నిమిషాల లోకల్‌, ఎస్‌టీడీ కాల్స్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
  On Rs. 396 Recharge, Idea Offers 70 GB Data For 70 Days
ఈ రీఛార్జ్‌తో ఐడియా నెట్‌వర్క్‌తో పాటు, ఇతర నెట్‌వర్క్‌లకు ఉచిత కాల్స్‌ చేసుకోవచ్చు. అయితే రోజులో 300 నిమిషాలు, వారానికి 1,200 నిమిషాలు మాత్రమే వినియోగించుకునే వెసులుబాటు ఉంది. పరిమితి దాటిన కాల్స్‌కు నిమిషానికి 30పైసలు వసూలు చేయనున్నారు. ఇక రోజుకు 1జీబీ డేటాను మాత్రమే ఈ ప్యాక్‌ ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంది.

- Advertisement -