వైసీపీ హయాంలో కేవలం 36 మంది అమ్మాయిలే మిస్ అయ్యారు అన్నారు మాజీ మంత్రి రోజా. దిశా యాప్ ద్వారా మిస్ అయిన అనేక మంది ఆడపిల్లలను రక్షించాం అన్నారు. నిజంగా మా వాళ్లు తప్పు చేస్తే శిక్షించండి అంతేకాని కావాలని మా వాళ్లను అరెస్ట్ చేస్తే మాత్రం ఊరుకోం అన్నారు.
మా నాయకుడు జగనే మా బ్రాండ్ అన్నారు. మాపై కేసులు పెట్టించడానికి కాదు….ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు పోలీసులను వాడండన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇన్నాళ్లు టీడీప, జనసేన చేసిన తప్పుడు ప్రచారం బట్టబయలైందన్నారు.
ప్రభుత్వం లో వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధం అన్నారు.ఐదేళ్ళలో 34 కేసులు మహిళల అక్రమ రవాణాకు సంబంధించి నమోదయ్యాయి అని సాక్షాత్తు హోంమంత్రి అనితనే అసెంబ్లీ లో ప్రశ్నకి సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చారు అన్నారు. గతంలోనే మిస్సింగ్ కేసులలో 99.5 శాతంకి పైగా మహిళలను గుర్తించారని కేంద్ర హోంశాఖ కూడా పార్లమెంట్ లో స్పష్టం చేసింది… ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి అన్నారు. అధికారం కోసం ఎంతటి అబద్ధమైన చెప్తారా..? చెప్పాలన్నారు.
Also Read:కొడంగల్‌లో రేవంత్ సోదరుడి అరాచకాలు:ఈటెల