‘మెకానిక్ రాకీ’ చాలా మంచి సినిమా:విశ్వక్

6
- Advertisement -

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ గేర్, ట్రైలర్ 1.0 సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగర్ లో ‘మెకానిక్ రాకీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 2.0 లాంచ్ చేశారు. ఈ వేడుకలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిధులు పాల్గొన్నారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ… ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన వరంగల్ ఫ్యాన్స్ అందరికీ థాంక్యూ సో మచ్. ఈ వేడుకకు అతిధులుగా వచ్చిన కావ్య గారికి, ఎమ్మెల్యే గారికి థాంక్యూ సో మచ్. మేము చాలా కష్టపడి సినిమా చేస్తున్నాము. ఎంతో హార్డ్ వర్క్ చేసి మా సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాము. క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా గురించి ఏం రాసిన ఏం కామెంట్ చేసినా పర్వాలేదు. కానీ పర్సనల్ లెవెల్ లో ఎటాక్ చేయకూడదని కోరుతున్నాను. క్రిటిక్స్ రివ్యూస్ మాకు మంచి సినిమా చేయడానికి ఒక మోటివేషన్. పర్సనల్ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ పర్సనల్ ఒపీనియన్ పై మాట్లాడే ఫ్రీడమ్ అప్ స్పీచ్ మాకు ఉంది. ఈ సినిమా తర్వాత రివ్యూస్ గురించి క్రిటిక్స్ గురించి నేను మాట్లాడను. మీరు స్వేచ్ఛగా రాసుకోవచ్చు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం మా పని. మీరు కూడా ఒక సినిమా గురించి రాస్తున్నప్పుడు బాధ్యతగా ఉండాలని కోరుతున్నాను. మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూశాను. ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయిన మళ్లీ సినిమా తీస్తాను. మాకు తెలిసిందంట ఒకటే సినిమా సినిమా సినిమా. అంతే ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాం. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అభిమానులు, ప్రేక్షకులే. నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా పుష్ప ట్రైలర్ ఈరోజు వచ్చింది. అదిరిపోయింది. రేపు ఉదయం 11 గంటలకి మా ట్రైలర్ రిలీజ్ చేస్తాం. రేపు మా ట్రైలర్ చూడండి. డైరెక్టర్ రవితేజ తెలుగులో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. మీనాక్షి శ్రద్ధ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా పెమ్ చేశారు. నిర్మత రామ్ గారు నాకు పెద్ద సపోర్ట్ సిస్టం. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంపాజిబుల్. తప్పకుండా ఆయన కాలర్ ఎగరేసుకునేలా చేస్తా. చాలా మంచి సినిమా తీశాం. నవంబర్ 21న పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయి. 21 న పెయిడ్ ప్రీమియర్ కి రండి. నేను చేసిన పది సినిమాల ఎక్స్పీరియన్స్ తో చెబుతున్నాను. ఇది చాలా మంచి సినిమా. ఒక ఐదు నిమిషాలు కూడా బోర్ కొట్టదు. సినిమా చూడండి. మీరు బాగుందని చెప్తే 22 నుంచి మిగతా ఆడియన్స్ చూస్తారు. మనోజ్ అదిరిపోయే విజువల్స్ ఇచ్చారు. మా మ్యూజిక్ డైరెక్టర్ జోక్స్ బిజోయ్ అదిరిపోయే ఆర్ఆర్ ఇచ్చారు. తెలంగాణలో స్టార్ట్ అయిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో సక్సెస్ మీట్ తో ఎండ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈవెంట్ కి వచ్చిన అందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. జైహింద్’ అన్నారు.

ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. మెకానిక్ రాకీ ట్రైలర్ 2.o అదిరిపోయింది. విశ్వక్సేన్ ఇచ్చి పడేసిండు. విశ్వక్ మాన్ విత్ గోల్డెన్ హార్ట్. వరంగల్లో చేస్తానని రెండు నెలల క్రితం నాతో చెప్పారు ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారు. అలాగే వరదల సమయంలో రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి 10 లక్షలు చొప్పున డొనేట్ చేశారు. మెకానిక్ రాకీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మెకానిక్ రాకీ నిర్మాతలకు, సినిమా యూనిట్ కు, అభిమానులుకు అందరికీ నమస్కారం. మీ అందరి కేరింతలు చూస్తుంటే ఈ సినిమా సూపర్ హిట్ అయిపోతుందనిపిస్తోంది. సినిమా యూనిట్ ఆల్ ది బెస్ట్. అందరికీ ధన్యవాదాలు’అన్నారు.

హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. వరంగల్ ఐ లవ్ యూ. వరంగల్ కి రావడం ఫస్ట్ టైం. మీ ప్రేమ అభిమానానికి థాంక్యూ సో మచ్. ట్రైలర్ వన్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ 2 కూడా మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇది యూత్ అండ్ మాస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అందరూ తప్పకుండా నవంబర్ 22న థియేటర్స్ లో చూడండి’ అన్నారు

హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. వరంగల్ రావడం ఇదే మొదటిసారి. ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్. సినిమా నవంబర్ 22న రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరంతా థియేటర్స్ లో చూడాలి. సినిమా బంపర్ హిట్ అయిన తర్వాత మళ్లీ మీ అందరిని కలుస్తాము. థాంక్యూ సో మచ్’అన్నారు.

నిర్మాత రజనీ తాళ్లూరి మాట్లాడుతూ.. హలో వంరంగర్. . మెకానిక్ రాకీ’ నవంబర్ 22న విడుదల కాబోతోంది. అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. థాంక్ యూ’ అన్నారు.నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. హలో వరంగల్. మెకానిక్ రాకీ’ నవంబర్ 22న విడుదల కాబోతోంది. ఇది మాస్ కా దాస్ విశ్వక్ చాలా కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా ఇది. డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది ఆశిస్తున్నాను. ఈ సినిమా నటించిన మీనాక్షి, శ్రద్దా, సునీల్ అందరికీ థాంక్స్. ఇది కంప్లీట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. డెఫినెట్ గా అందరికీ నచ్చుతుంది. నవంబర్ 22న అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

Also Read:బాధితులకు ఉరిశిక్షా..సత్యవతి రాథోడ్ ఫైర్!

- Advertisement -