ఢిల్లీలో డేంజర్ బెల్స్.. మరింత క్షీణించిన గాలి నాణ్యత!

1
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో డేంజర్ బెల్స్ మొగుతున్నాయి. వాయు కాలుష్యం తీవ్రత తారాస్థాయికి చేరి గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఇవాళ ఉదయం 6గంటలకు సమయానికి గాలి నాణ్యత సూచిక 481కు చేరింది. దట్టంగా పొగమంచు అలముకోవడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

9వ తరగతి వరకు విద్యార్థులందరికీ అన్ని పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని, 10 నుంచి 12 తరగతుల వారికి మాత్రమే పాఠశాలల్లో క్లాసులు నిర్వహించాలని ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ఉత్తర్వులు జారీ చేశారు. జీఆర్ఏపీ స్టేజ్ 4లో చర్యల్లో భాగంగా.. నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లే, అవసరమైన సేవలను అందించే వాహనాలు మినహా ఢిల్లీ నగరంలోకి ట్రక్కులు, కాలుష్య వాహనాలు వంటి అనేక వాహనాలు రాకుండా ఆంక్షలు విధించారు.

ఎల్ఎన్జీ, జీఎన్జీ, ఎలక్ట్రిక్, బీఎస్-4 డీజిల్ ట్రక్కులు మాత్రమే ఢిల్లీలోకి ప్రవేశానికి అనుమతించనున్నారు. హైవేలు, రోడ్లు, ప్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్లు, పైపులైన్లు.. ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

Also Read:AA: పుష్ప అంటే వైల్డ్ ఫైర్

- Advertisement -