లగచర్ల బాధిత కుటుంబాలతో ఢిల్లీకి కేటీఆర్

1
- Advertisement -

ప్రభుత్వం, పోలిసుల అరచకాలను,గిరిజన మహిళలపై దాడులు,అక్రమ అరెస్ట్ లు,వారికి జరుగుతున్న అన్యాయలపై వివిధ జాతీయ కమిషన్ లకు పిర్యాదు చేయనున్నారు భాదితులు. వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్,పలు గిరిజన సంఘాల నేతల ఆధ్వర్యంలో ఢిల్లీకి చేరుకున్నారు లగచర్ల ఫార్మా బాధిత గిరిజన మహిళలు.

ఇవాళ ఢిల్లీకి రానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలతో కలిసి జాతీయ ఎస్టీ కమిషన,జాతీయ మహిళ కమిషన,జాతీయ మానవహక్కుల కమిషన్ ను ,జాతీయ ఎస్సి కమీషన్ ను చైర్మన్ లకు పిర్యాదు చేయనున్నారు.

ఇవాళ ఉదయం 11 గంటలకు జాతీయ కమిషన్ ను ,11.45 నిమిషాలకు జాతీయ మానవహక్కుల కమిషన్ ను,12.30 నిమిషాలకు జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలవనున్నారు.

1.30 నిమిషాలకు జాతీయ ఎస్సి కమిషన్ చైర్మన్ లను కలసి ఫిర్యాదు చేశారు.అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు కనిస్ట్యూషన్ క్లబ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎస్సి ఎస్టీ కమిషన్ బాధిత కుటుంబాలతో కలిసి పిర్యాదు చేసింది బిఆర్ఎస్ పార్టీ.

మరోపక్క ఇవాళ లగచర్ల గ్రామం,వికారాబాద్ జిల్లా కలెక్టర్, సంగారెడ్డి జైలు లో ఉన్న బాధితులను కలిసి వివరాలు సేకరించనుంది జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుల బృందం.

- Advertisement -