బిగ్ బాస్ చరిత్రలో తొలిసాని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎక్స్ హౌస్‌మేట్స్ మిమ్మల్ని నామినేట్ చేయబోతున్నారు.. అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. ఇలా ప్రకటించిన మరు క్షణం డోర్స్ ఓపెన్ అవ్వగా సోనియా ప్రత్యక్షమైంది. ఆమెను చూడగానే హౌస్‌మేట్స్ గుండేలు గుబేల్ అన్నాయి.
వచ్చి రాగానే సోనియా తన నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది. బిగ్‌బాస్ నా ఫస్ట్ నామినేషన్ ప్రేరణ అనగానే వచ్చావా నువ్వు అక్కా అంటూ ప్రేరణ కౌంటర్ వేసింది. చెప్పు చెల్లే అంటూ సోనియా రియాక్ట్ అయితే ఇప్పుడు నాకు అక్క కాదమ్మా నువ్వు అంటూ ప్రేరణ డైలాగ్ కొట్టింది. దీంతో కోపంతో ప్రేరణపై రెచ్చిపోయింది సోనియా.
తన రెండో నామినేషన్ నిఖిల్‌కి వేసింది. నిఖిల్.. యష్మీకి నీకు మధ్య ఏం జరిగిందో దాన్ని బట్టే తనకి అనిపించింది తను చెప్పింది అంటూ సోనియా అంది. దీనికి ఆ అమ్మాయికి ఆ ఫీలింగ్ కలిగినప్పుడే నేను కట్ చేశా…నేను మాట్లాడలేదు కదా ఆ అమ్మాయితో అంటూ నిఖిల్ తప్పించుకునేందుకు ట్రై చేశాడు. దీంతో యష్మీ మధ్యలో కలుగజేసుకొని నువ్వు కట్ చేశావా అంటూ అడిగింది. దీంతో నీ దగ్గర దీని గురించి ఎలాంటి మాటలు మాట్లాడలేదు అనగా యష్మీకి బీపీ వచ్చేసింది.
నువ్వు చెప్పుంటే నేను నీ జోలికి వచ్చుండే దాన్నే కాదు అంటూ యష్మీ అంటే నేనంత మోడ్రన్ కాదు అని నిఖిల్ చెప్పాడు. కానీ బ్యాడ్ అయింది ఎవరూ నేను.. అంటూ సీరియస్ అయింది యష్మీ. వెంటనే నిఖిల్ భుజం తట్టి ఓకే గాడ్ బ్లెస్ యూ అంటూ సీసా నెత్తికేసి కొట్టి నామినేట్ చేసింది సోనియా. ఇలా ఈ సీజన్‌లో ఎలిమినేట్ కంటెస్టెంట్లు వచ్చి ఈ వారం నామినేషన్ ప్రక్రియ చేస్తారు.
Also Read:సోషల్ మీడియా దుర్వినయోగం కొత్త చట్టం!