ట్రంప్ గెలవడంతో ఎక్స్‌కు యూజర్ల గుడ్ బై

2
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ప్రభావం చాలా వాటిపై పడుతోంది. ట్రంప్ గెలవడం జీర్ణించుకోలేని మహిళలు చాలామంది తమ ప్రియుడు, భర్తలపై మండిపడుతున్నారు. కొంతమంది అమెరికన్లు దేశం విడిచిపెట్టి వెళుతుండగా.. మరికొందరు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ పైనా ట్రంప్ ఎఫెక్ట్ పడింది.

డొనాల్డ్ ట్రంప్ కు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మద్దతు పలకడం, ట్రంప్ గెలుపు కోసం ప్రచారం చేయడంతో పాటు ‘ఎక్స్’ లోనూ ట్రంప్ కు అనుకూలంగా ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మండిపడుతున్న యూజర్లు ‘ఎక్స్’ కు గుడ్ బై చెబుతున్నారు. ఇదొక విషపూరితమైన ప్లాట్ ఫాం అంటూ ‘ఎక్స్’ ను వీడుతున్నారు. రోజూ లక్షలాది మంది తమ ఖాతాలను తొలగించుకుంటున్నారని సమాచారం. వీరంతా ‘బ్లూస్కై’ లో చేరుతున్నట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్ దాని పేరును ‘ఎక్స్’ గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ పూర్తికాక ముందు ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సే వ్యవహరించారు. ట్విట్టర్ ను టాప్ పొజిషన్ లోకి తీసుకెళ్లడంలో డోర్సే కృషి ఎంతో ఉంది. అయితే, ట్విట్టర్ పగ్గాలు తన చేతికి వచ్చాక డోర్సేను మస్క్ తొలగించాడు. దీంతో 2019లో జాక్ డోర్సే ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ‘బ్లూస్కై’ ని తీసుకొచ్చారు. దాదాపు ఐదేళ్లు ‘బ్లూస్కై’ ని డెవలప్ చేసిన డోర్సే ఇటీవలే అందులో నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ‘బ్లూస్కై’ కి జే గ్రాబర్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

Also Read:KTR: గాడ్సే శిష్యుడు రేవంత్..

- Advertisement -