Harish:ప్రజా తిరుగుబాటును తప్పించుకోలేరు

2
- Advertisement -

ప్రజల తిరుగుబాటును తప్పించుకోలేరన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖత్ అనంతరం చర్లపల్లి జైల్ వద్ద మీడియాతో మాట్లాడారు హరీశ్‌. రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా బీఆర్ఎస్ కుట్ర అంటున్నడు..అశోక్ నగర్ లో విద్యార్థులు తిరగబడితే బీఆర్ఎస్ కుట్ర అంటరు అన్నారు.

రైతులు రోడ్ల మీదకు వస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు..పోలీసులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు..గురుకుల విద్యార్థులు నిరసన చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు అని మండిపడ్డారు. పీడిత వర్గాలకు అండదండగా నిలబడటమే మా బాధ్యత..మాకు ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, నన్నో, కేటీఆర్ నో, మా ఎమ్మెల్యేలను అరెస్టు చేయండి కానీ అమాయక గిరిజన రైతులను అరెస్టులు చేయడం సరికాదు అన్నారు.

ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా?,ఫార్మా సిటీ పెట్టాలంటే గత ప్రభుత్వం సేకరించిన 14వేల ఎకరాల్లో పెట్టు..కొడంగల్, జహీరాబాద్ లలో పార్మాసిటీ భూముల సేకరణ నిర్ణయం ఉపసంహరించుకో అన్నారు. నీ ప్రాధాన్యం అదానీ, నీ ప్రాధాన్యం నీ అల్లుల్లు…దళిత, గిరిజన, పేదల పక్షాన మేం పోరాటం చేస్తం. బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందన్నారు. సమాధానం చెప్పలేక కేటీఆర్ మీద కుట్ర చేస్తున్నవు…నువ్వు, కోదండరాం, దామోదర్ రాజనర్సింహ ప్రజల్ని రెచ్చగొట్టారు. ఆనాడు మీమీద కేసులు పెట్టలేదు అన్నారు.

ప్రశ్నించే గొంతు కేటీఆర్ మీద కేసులు పెడతరా..రిమాండ్ రిపోర్టులో ఏం రాసారో తెలియదు అన్నారు నరేందర్ రెడ్డి,కేటీఆర్ ని కూడా ఇందులో ఇరికించే ప్రయత్నం చేసారు అన్నడు…చదివే అవకాశం లేకుండా తప్పుడు రిమాండ్ రిపోర్టులో సంతకం పెట్టించారు అని చెప్పారన్నారు. బడా ఫార్మా కంపెనీల మీద, నీ అల్లుడి మీద ప్రేమ ఉంది తప్ప రైతులు, గిరిజనుల మీద లేదు…బడా బడా బాబులకు భూములు కట్టబెడుతరా అని ప్రశ్నించారు. మాకు న్యాయం మీద, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది..నిర్దోషిగా నరేందర్ రెడ్డి బయటకు రావడం ఖాయం అన్నారు.

Also Read:KTR:రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు రెడీ!

- Advertisement -