KTR:ఆర్ఆర్ ట్యాక్స్‌పై చర్యలేవి?

0
- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం గా మారిందంటూ ప్రధాని మోడీ అంటారు. మరి చర్యలు తీసుకోవటానికి ఆయనను ఎవరు ఆపుతున్నారో చెప్పాలన్నారు కేటీఆర్.మేము కాంగ్రెస్ పార్టీ అవినీతి పై పూర్తి వివరాలు ఇచ్చినప్పటికీ ఎందుకు విచారణ జరపటం లేదు..ప్రధాని మోడీ గారు అన్నట్లు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారింది. మీకు ఈ విషయాలు తెలిసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అన్నారు. ప్రధాని మోడీ తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. మరి ఎందుకు ప్రధాని మోడీ చర్యలు తీసుకోవటం లేదు అన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అమృత్ టెండర్ల విషయంలో కూడా కేంద్రం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు బీజేపీ చేతులో ఉందన్నారు. వాళ్లు ఆరోపణలు చేసిన దాంట్లో నిజంగా నిజం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. మీ ఆరోపణల్లో నిజం ఉంటే వెంటనే విచారణ ప్రారంభించండన్నారు.అమృత్ టెండర్లలో ఒక్క ముఖ్యమంత్రి బావమరిదికి మాత్రమే కాదు, తెలంగాణ మంత్రి పొంగులేటికి కూడా పనులు దక్కాయన్నారు.

కేబినేట్ సమావేశంలో కూర్చున్న మంత్రికే పనులు కట్టబెట్టమంటే ఇది ఆఫీస్ ఆఫ్ ఫ్రాఫిట్ నిబంధన ఉల్లంఘన కాదా? ఇది క్రోనీ క్యాపిటలిజం కాదా? చెప్పాలన్నారు. ఈ టెండర్ల విషయంలో ఎలాంటి అవకతవకలు లేకపోతే బీజేపీ అదే విషయాన్ని ప్రజల ముందు ఉంచాలి…ఒకవేళ తప్పు జరిగితే ఎవరెవరి పై చర్యలు తీసుకోవాలో తీసుకోండన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ స్కామ్ లకు సంబంధించి కేవలం మొదటి ఎపిసోడ్ మాత్రమే…ఈ కాంగ్రెస్ పార్టీ క్రోనీ క్యాపిటలిజం, అవినీతి స్కామ్ లను బయటపెట్టేందుకు తరుచూ ఢిల్లీ వస్తూనే ఉంటాం అన్నారు.

రాహుల్ గాంధీకి తన పార్టీ ముఖ్యమంత్రి ఏ విధంగా క్రోనీ క్యాపిటలిజానికి పాల్పడుతున్నాడో చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాం అన్నారు. ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని మేము నిలదీస్తూనే ఉంటాం. వారి అవినీతిని ఎండగడుతూనే ఉంటాం అన్నారు. అమృత్ టెండర్ల విషయంలో కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కు ఫిర్యాదు చేయటంతో ఆయన సమాచారం తెలుసుకుంటానని చెప్పారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యే వరకు చర్యలు తీసుకోకపోతే మేము రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తుతునే ఉంటాం…కేంద్రం ఏం చర్యలు తీసుకుంటారో చూస్తాం. ఎందుకంటే స్వయంగా ప్రధాని మోడీ తెలంగాణలో అవినీతి జరుగుతుందని ఆరోపణలు చేశారు..ఊరికే ఆరోపణలు చేయటం కాకుండా మీరు చర్యలు తీసుకుంటేనే ప్రజలు నముత్మారు అన్నారు. మేము ఢిల్లీకి వస్తే కాంగ్రెస్ కు భయం పట్టుకుంది. కానీ మేము మళ్లీ మళ్లీ ఢిల్లీకి వచ్చి మీ స్కామ్ లను బయట పెడుతూనే ఉంటాం..11 నెలల్లో 26 సార్లు ఢిల్లీకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 26 పైసలు కూడా తెలంగాణకు తేలేదు. కానీ మేము ఢిల్లీకి వస్తే మీకు ఏం పని అని మంత్రి పొంగులేటి అంటున్నాడు అన్నారు. మీ కుంభకోణాలు, మీ చేతగానీ పాలనను దేశ ప్రజల ముందుకు తెచ్చేందుకు మేము ఢిల్లీకి వస్తే మీకు భయమెందుకు?…ప్రభుత్వ స్కామ్ లను మేము బయటపెడితే వాళ్లకు భయం పట్టుకుందన్నారు.

Also Read:Pawan:మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్

- Advertisement -