- Advertisement -
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు ఇటీవలే బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.50 లక్షలు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి షారుక్‌ను బెదిరించగా ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజాగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. బెదిరింపులకు పాల్పడింది న్యాయవాది మహ్మద్ ఫైజాన్ ఖాన్ గా గుర్తించారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్‌లో గల నివాసంలో అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. భారత న్యాయ సంహితలోని 308(4), 351(3)(4) సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు.
Also Read:కల్తీ మిరియాలని ఇలా గుర్తించండి!
- Advertisement -