రూ. 2.94 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

2
- Advertisement -

రూ. 2.94 లక్షల కోట్లతో ఏపీ 2024 – 25 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్. ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు పయ్యావుల కేశవ్. రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2.34లక్షల కోట్లు కాగా మూలధనం వ్యయం అంచనా రూ. 32,712 కోట్లు.

రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు కాగా ద్రవ్య లోటు రూ. 68,743 కోట్లు అని తెలిపారు.జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19శాతం కాగా జీఎస్డీపీలో ద్రవ్యలోటు అంచనా 2.12 శాతం. వ్యవసాయ బడ్జెట్ రూ. 43,402.33 కోట్లు కాగా వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 11,885 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

ఎస్సీ కాంపొనెంట్ కు రూ. 18,497 కోట్లు కాగా ఎస్టీ కాంపోనెంట్ కు రూ. 7,557 కోట్లు,బీసీ కాంపొనెంట్ కు రూ. 39,007 కోట్లు కేటాయించారు. అత్యల్ప వర్గాల సంక్షేమానికి రూ. 4,376 కోట్లు కేటాయించగా ఉచిత సిలిండర్ పంపిణీకి రూ. 895 కోట్లు పంపిణీ చేశారు.

గత ప్రభుత్వం ముఖ్యమైన పథకాలకు చెల్లింపులు చేయలేదు అన్నారు. రాబోయే 25ఏళ్ల ఆదాయాన్ని తగ్గించి నిధులను పక్కదారి పట్టించిందన్నారు. గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులు చేయలేదు. గత ప్రభుత్వంలో రూ. 1.35లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయి. సహజ వనరులను కొల్లగొట్టారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు గత పాలకులు గండి కొట్టారు. దురుద్దేశంతో ఇసుక, ఎక్సైజ్ పాలసీలు రూపొందించారు అన్నారు.

Also Read:KTR:బీసీ డిక్లరేషన్ బోగస్

- Advertisement -