నేతన్న కుటుంబానికి కేటీఆర్ పరామర్శ

2
- Advertisement -

సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నేతన్న దంపతుల కుటుంబాన్ని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ముగ్గురు పిల్లలు చదువుకున్నంత వరకు తన పిల్లల మాదిరి చదివిస్తానని హామీ ఇచ్చారు కేటీఆర్. పిల్లల ఒక్కొక్కరి పేరు మీద రెండు లక్షల రూపాయల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని, వారికీ పూర్తిగా అండగా ఉంటానని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ విడుదల చేసి బీసీలను ఆదుకుంటాం అని మోసం చేసిందన్నారు. సిగ్గు, లజ్జ ఉంటే నేత కార్మికులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. పదకొండు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అన్నారు. బతుకమ్మ చీరల కాంట్రాక్టు రద్దు చేయడం వల్లే ఇక్కడ నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నారు.

Also Read:రైతుబంధు ఇవ్వలేని అసమర్థ కాంగ్రెస్!

- Advertisement -