అమెరికా దేశాధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్వేత సౌధానికి మేనేజర్‌గా సుసాన్ సమ్మర్వాల్ వైల్స్‌ను నియమించారు ట్రంప్. తన ఎన్నికల ప్రచారంలో మేనేజర్‌గా ఉన్న సుసాన్ ను వైట్‌హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికా చరిత్రలో ఓ గొప్ప రాజకీయ విజయాన్ని నమోదు చేయడంలో హెల్ప్ చేసిన వైల్స్‌కు మరో కీలక బాధ్యతను అప్పగిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే శ్వేతసౌధంలో కీలక బాధ్యతలను చేపడుతున్న తొలి మహిళగా వైల్స్ రికార్డు సృష్టించనున్నారు.
అధ్యక్షుడి పరిపాలనలో వైట్‌హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పాత్ర కీలకం. దేశాధ్యక్షుడికి కావాల్సిన స్టాఫ్‌ను మేనేజరే నియమిస్తారు. ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ద్వారా తమ పని చేస్తారు. రోజు వారీ కార్యక్రమాలు, సిబ్బంది పనులపై వైట్‌హౌజ్ మేనేజర్కు అధికారం ఉంటుంది.
Also Read:కమల్ హాసన్… ‘థగ్ లైఫ్’