ఓటమిని అంగీకరిస్తున్నా: కమలా

1
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తొలిసారి స్పందించారు కమలా హారిస్. స్వేచ్ఛ కోసం శ్రమించాల్సి ఉంటుందని… అయితే, దేశం కోసం చేసే పోరాటం ఎప్పుడూ విలువైనదేనని తెలిపారు. ఇది ఆశించిన ఫలితం కాదు. దీని కోసం మనం పోరాడలేదు కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించాల్సిందేనన్నారు.

ఎన్నికల్లో పోటీపడిన తీరుపై గర్వంగా ఉందని తెలిపారు. దేశం పట్ల ప్రేమ, సంకల్పంతోపాటు మీరు నాపై ఉంచిన నమ్మకంతో నా హృదయం నిండిపోయిందని వెల్లడించారు.ప్రజలందరి స్వేచ్ఛ, న్యాయం, అవకాశాలు, గౌరవం కోసం నా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. స్వేచ్ఛ, న్యాయం, భవిష్యత్తు కోసం మళ్లీ నిలబడాల్సిన, నిమగ్నం కావాల్సిన సమయం ఇదేనని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపినట్లు కమలా హారిస్‌ తెలిపారు. అధికార మార్పిడి శాంతియుతంగా సాగేలా ఆయనకు, ఆయన బృందానికి సాయం చేస్తామని వెల్లడించారు.

Also Read:‘అమరన్’…బ్లాక్ బస్టర్

- Advertisement -