బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 65 రోజులు పూర్తి చేసుకుంది. నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో తాజా ఎపిసోడ్‌లో గార్డెన్ ఏరియాలో మూడు బ్రీఫ్‌కేసులు ఏర్పాటు చేశారు. వీటిపై ఎవరు మమ్మల్ని తీసుకుంటారు అని రాసి ఉంది. దీంతో కంటెస్టెంట్స్ బయపడి పోయారు.
బిగ్‌బాస్ ఇచ్చిన మొదటి టాస్క్ ‘లక్డీ కా పూల్’. ఈ టాస్కు ప్రకారం పోటీ దారులు ఇద్దరూ చక్కలతో ప్లాట్‌ఫామ్‌ను నిర్మించి దానిపై బాల్స్‌ను రోల్ చేయాలి.. ఆ బాల్స్ చివరిలో ఉన్న బాస్కెట్లో పడాలి. . ఇలా ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్లు విన్నర్ అవుతారు. ఇక ఈ గేమ్‌లో రోహిణి-నబీల్-పృథ్వీలలో ఎవరు వస్తారంటూ బిగ్‌బాస్ అడిగాడు. దీనికి పంటలు వేసుకొని రోహిణిని వచ్చింది. ఇక తన ప్రత్యర్థిగా హరితేజను ఎన్నుకుంది.ఈ టాస్కులో గెలిచిన రోహిణి మెగా చీఫ్ కంటెండర్ అయిపోయింది.
తర్వాత నబీల్-గౌతమ్‌కి ‘షేప్ యుఆర్ ఫ్యూచర్’ అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీని ప్రకారం ఇరువురు కంటెస్టెంట్లు తమ ముందున్న బోర్డ్‌పై ఆయా షేపుల్లో ఉన్న వస్తువులను తగిలించాలి. బజర్ మోగేలోపు ఎవరు ఎక్కువ షేప్స్ ఫిట్ చేస్తే వాళ్లు విన్నర్. ఎంతకీ నబీల్-గౌతమ్ గేమ్ తెగకపోవడంతో బిగ్‌బాస్ పాస్ ఇచ్చాడు. ఇప్పుడు రెండో రౌండ్ మొదలుకాబోతుంది.. ఇందులో షేప్ సైజెస్‌తో సంబంధం లేకుండా ఎవరైతే ముందుగా ఒక షేప్‌ను బోర్డ్‌పై తగిలిస్తారో వాళ్లు విన్నర్ అంటూ అనౌన్స్ చేశాడు. ఈ టాస్క్‌లో నబీల్ విజేతగా నిలిచాడు. గెలిచిన నబీల్ తన బ్రీఫ్ కేస్ తెరవగా అందులో రూ.లక్ష 20 వేలు ఉన్నాయి. వీటిని కూడా ప్రైజ్ మనీకి యాడ్ చేశాడు బిగ్‌బాస్.
Also Read:చలికాలంలో ఈ జబ్బులతో జాగ్రత్త!