- Advertisement -
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఎంతో కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేల కోసం పాత వారిని పక్కన పెట్టకండని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన జీవన్ రెడ్డి..పది సంవత్సరాలు సర్వశక్తులు ఒడ్డిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకురావడానికి కష్టపడితే నేడు నోటికాడ పళ్లెం లాక్కున్నట్లు అయింది మా పరిస్థితి అన్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా కూడా.. అవమానాలు ఎదుర్కొంటునే ఉన్నామన్నారు.
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఆయన లేఖ రాసిన విషయం తెలిసిందే.
Also Read:దక్షిణాది భాషల్లో.. ‘ఈసారైనా’
- Advertisement -