Harish Rao: ఉచిత కరెంట్‌పై ద్వంద్వ వైఖరి

2
- Advertisement -

ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తుందన్నారు మాజీ మంత్రి హరీశ్‌ ఆరవు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన హరీశ్..దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటును అందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది బీఆర్‌ఎస్ పార్టీ కానీ ఆ ఘనత కూడా తమదేనంటూ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శిచారు.

గతంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు దండగ అని, మూడు గంటల కరెంటు సరిపోతుందని రైతు వ్యతిరేక వైఖరిని ప్రకటించిన చరిత్ర రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. ఇప్పుడేమో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓట్ల కోసం కేసీఆర్ అందించిన 24 గంటల ఉచిత కరెంటు ఘనతను తమ ఖాతాలో వేసుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు విమర్శించారు.

Also Read:బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్

- Advertisement -