బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు 10వ వారం నామినేషన్స్ వాడివేడిగా సాగాయి. గౌతమ్- నిఖిల్ మధ్య నువ్వా-నేనా అన్నట్లు సవాల్- ప్రతిసవాల్ నడిచింది. ముందుగా రోహిణిని పృథ్వీ నామినేట్ చేస్తూ తన రీజన్స్ చెప్పాడు. దీనికి రోహిణి వాదించినా సరే ఎప్పటానే పృథ్వీ రెచ్చిపోయాడు. ఆ తర్వాత గత కొన్ని వారాలుగా సాగుతున్న ప్రేరణ- హరితేజ గొడవ ఈ నామినేషన్స్‌లో కూడా సాగింది.
ఎర్ర కండువాను నెత్తికి కట్టుకొని నామినేషన్స్‌లో రెచ్చిపోయాడు గౌతమ్. నిఖిల్‌ని నామినేట్ చేయగానే భారీ డైలాగ్ కొట్టాడు గౌతమ్. ఎవడు నన్ను ఏమన్నా భయం లేదు.. అన్నీ తీసి పడేస్తున్నా.. ఇప్పుడు చెబుతున్నా అశ్వత్థామ ఈజ్ బ్యాక్.. అంటూ గౌతమ్ సీరియస్‌గా చెప్పాడు. ఇక ఈ డైలాగ్‌కి యష్మీ ఓ వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చింది.
గౌతమ్ డిఫెండ్ చేసుకుంటూ నిఖిల్‌పై సీరియస్ అయ్యాడు. దీనికి అసలు నువ్వు బయటికెళ్లడానికి రెడీనా అంటూ గౌతమ్ అంటే నేను రెడీ చూసొద్దాం.. అమ్మతోడు నాకు దమ్ముంది గేటు తీయమను.. అంటూ నిఖిల్ ఛాలెంజ్ చేశాడు. దీంతో పదా పదా.. అంటూ ఇద్దరూ బిగ్‌బాస్ మెయిన్ డోర్ దగ్గరికెళ్లి నిలబడ్డారు. ఇలా 10వ వారం నామినేషన్స్ గట్టిగానే జరిగాయి.
Also Read:BRS:కులగణన పేరుతో దగా చేస్తున్న రేవంత్