KTR: పేదలంటే రేవంత్‌కు ఎందుకింత కోపం?

2
- Advertisement -

పేద, మధ్య తరగతి ప్రజలంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత కోపం? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హెచ్ఎండీఏ పరిధిలోని జీపీ లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు బంద్ పెట్టటం మూర్ఖపు చర్య అన్నారు.

హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టింది చాలదా? ఇప్పుడు వాళ్లకు ప్లాట్లు కూడా లేకుండా చేస్తారా? అని ప్రశ్నించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు బంద్ చేయటమేమిటి? అన్నారు. బిల్డర్ల నుంచి స్క్వేర్ ఫీట్ కు పేద, మధ్యతరగతి ప్రజల నుంచి చదరపు గజానికి వసూళ్లా? ఇది కరెక్ట్ కాదన్నారు.

ఎవరో చేసిన తప్పుకు ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లను బాధితులు చేస్తారా?.. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే జీపీ లే అవుట్లు వందలాదిగా వెలిశాయి అన్నారు. అప్పట్లో అనుమతించి, ఇప్పుడు కాదంటే ప్లాట్లు కొన్న వాళ్లు ఏమైపోవాలి? అన్నారు.

Also Read:సంక్రాంతి రేసులో వెంకీ!

- Advertisement -