చెరువుల సంరక్షణ పేరుతో ప్రభుత్వం పేపర్ మీద గొప్పలు చెబుతున్నప్పటికీ అసలైన ఎజెండా అవినీతి మాత్రమేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసి బ్యూటిఫికేషన్ కి మేము వ్యతిరేకం కాదు కానీ మూసి లూటిఫీకేషన్ కి వ్యతిరేకం. మూసీ ప్రక్షాళణ దేశంలోనే అతిపెద్ది అవినీతి స్కాం అవుతుందన్నారు. హైడ్రా కేవలం కొందరిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది ఇప్పటిదాకా ఒక్క పెద్ద బిల్డర్ ని కూడా హైడ్రా ముట్టుకోలేదు, కేవలం పేదలను మధ్యతరగతి ప్రజలను మాత్రమే నిర్దయగా దోచుకున్నదన్నారు .మూసీ నది ప్రక్షాళన అనేది దేశంలోనే అతిపెద్ద అవినీతి స్కామ్ గా నిలవబోతున్నది అన్నారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత సామాజిక మాధ్యమాల్లో పార్టీ మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా బాగా యాక్టివ్ గా మారారన్నారు. ఈ అంశంలో పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు అనేక అంశాలను చర్చించాము. పార్టీ తరఫున ఏం ఆశించకుండానే అద్భుతంగా పనిచేస్తున్నారని, వారి మద్దతును పార్టీకీ సోషల్ మీడియా వారియర్లు అందిస్తున్నారన్నారు. ఇంత బలమైన సోషల్ మీడియా బృందాన్ని కలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.త్వరలోనే ఒక విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా, కాంగ్రెస్కి మద్దతుగా వ్యవహరిస్తున్న ప్రధాన స్రవంతి మీడియాకి ప్రత్యామ్నాయం సోషల్ మీడియా మాత్రమే అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు తెలంగాణ పదం ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు నిలిచే ఉంటుందన్నారు. కెసిఆర్ గారు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన పార్టీని, తమ నాయకులందరికీ ఎప్పటికప్పుడు ఆయా అంశాల పైన మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కొత్తగా ఎన్నికైన ఈ ప్రభుత్వానికి ఇచ్చిన 420 హమీలు అమలు చేసేందుకు సరిపడా సమయం ఇచ్చారన్నారు. నూతన సంవత్సరం తర్వాత ఆయన నుంచి మరిన్ని కార్యక్రమాలను చూస్తామన్నారు
ప్రస్తుతం తమ విధులు మరిచి, చట్ట విరుద్ధంగా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులపైన రెచ్చిపోతున్న పోలీస్ అధికారులను గుర్తుపెట్టుకుంటామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో రాజకీయ వేధింపుల విషయంలో ప్రభుత్వ అధినేతలను ప్రసన్నం చేసుకునే పనుల్లో కొంతమంది పోలీసు అధికారులు బిజీగా ఉండడం వలన శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోయాయని కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి హోంమంత్రి అవసరం ఉందన్నారు. మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించమని తెలిపారు. మతపరమైన హింస వాంఛనీయం కాదన్నారు. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరంలో నెల రోజులపాటు ఎలాంటి కారణం లేకుండా 144 సెక్షన్ విధించడం షాక్ కు గురి చేసింది అన్నారు. ఏదో అత్యంత కీలకమైన అంశం సరిగా లేకుంటేనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపి కలిసి పని చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. అనేక అంశాలు రెండు పార్టీల నాయకులు కుమ్మకై పనిచేస్తున్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది అని తెలిపారు.ఇచ్చిన హామీలను తప్పుతున్న కాంగ్రెస్ లాంటి పార్టీల పైన చర్యలు తీసుకునేందుకు ప్రజలను పదేపదే మోసం చేయడానికి అరికట్టేందుకు బలమైన ఎన్నికల సంస్కరణలు అవసరమన్నారు.
Also Read:ఆకట్టుకుంటున్న ‘రోటి కపడా రొమాన్స్’ ట్రైలర్
మహారాష్ట్ర ఎన్నికల్లోను జాతీయ పార్టీలను ప్రజలు నమ్మవద్దని అక్కడి స్థానిక పార్టీలకు ఓటు వేయాలన్నారు. తమిళనాడు విజయ్ దళపతి ప్రారంభించిన రాజకీయ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయపరమైన అంశాల పట్ల విభేదాలే తప్ప తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి అగ్ర నాయకులందరితో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉన్నదన్నారు.
ప్రజలే సాధారణ వ్యక్తులను నేతలుగా తయారు చేస్తారని తన నమ్మకం అన్నారు బిఆర్ఎస్ పార్టీ బలంగా తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ కుటుంబం, తన స్నేహితులు, కుటుంబ సభ్యుల వల్లనే తనకు నిత్యం స్ఫూర్తి అభిస్తుందన్నారు.
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండే అవకాశం వలన మాకు నిబద్ధత కలిగిన, బలమైన నూతన నాయకత్వాన్ని తయారు చేసుకునే అవకాశం ఇచ్చింది. నిజం కన్నా పర్సెప్షన్, పీపుల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని గత ఎన్నికల ఓటమి మాకు నేర్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీలు ప్రజల్లో అవాస్తవికమైన ఆశల్ని రేకెత్తించాయని, రెండుసార్లు వరుసగా గెలవడంతో యాంటీ ఇన్ కంబెన్సీ కూడా తమ ఒటమి విషయంలో కొంత ప్రభావం చూపింది.
పార్టీ మారిన 10 మంది అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం బిజెపి చేస్తున్న మరొక జుమ్లా అయి ఉంటుందని, అయితే వారు తీసుకువచ్చే చట్టం ఎలాంటిదో చూడాల్సిన అవసరం ఉందన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇది అసాధ్యం అని తెలిపారు.
గ్రూప్ వన్ అభ్యర్థుల తన పూర్తి మద్దతు ఉంటుందన్న కెటిఅర్, పార్టీ తరఫున వారికి అండగా ఉంటామన్నారు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకువస్తాం అన్నారు. కొత్త సెక్రటేరియట్ ప్రారంభం నుంచి విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ బెటాలియన్ సిబ్బందిని మార్చి మళ్లీ ఎస్పీఎఫ్ కు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఏక్ పోలీస్ నినాదంతో టీజీఎస్పీ పోలీసుల ఆందోళనల నేపథ్యంలో ఇటీవల సీఎం ఇంటి దగ్గర సెక్యూరిటీ మార్పు…సీఎం, మంత్రులు ఉండే రాష్ట్ర పరిపాలనసౌధమైన సెక్రటేరియట్ వివీఐపీ జోన్లో ఉన్న నేపథ్యంలో ఆందోళన బాట పట్టిన బెటాలియన్ సిబ్బందిని మార్చాలని నిర్ణయించింది ప్రభుత్వం.
గతంలో సుదీర్ఘకాలం పాటు సెక్రటేరియట్ భద్రతా బాధ్యతలు చూసిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీస్ కు మళ్ళీ బాధ్యతలు అప్పగించారు. సచివాలయం ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించి, కవాతు చేసింది ఎస్పీఎఫ్ సిబ్బంది.ఇవాళ్టి నుంచి ఎస్పీఎఫ్ పహారాలోకి వెళ్లనుంది డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్.