KTR:రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా

3
- Advertisement -

పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తానని భాతర రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ తెలిపారు. దీపావళిరోజు నెటిజన్లతో జరిగిన సామాజిక మాద్యమం ఎక్స్ సంభాషణ అక్స్ కెటిఅర్ లో ఈ మేరకు కెటిఅర్ తెలిపారు. పలువరు ప్రత్యేకంగా ఈ అంశంలో కెటిఅర్ అభిప్రాయాన్ని కోరారు. దేశంలోని అనేక పార్టీల నేతలు, ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు, పార్టీలను బలోపేతం చేసేందుకు పార్టీ అద్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారు, మీరేప్పుడు చేస్తారని అడిగారు. దీనికి స్పందించిన కెటిఅర్ ఖచ్చితంగా తన పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు.

దాదాపు గంటన్నపాటు సాగిన ఈ సంభాషణలో కెటిఅర్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం

తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఒక శాపంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశాలు ఏమాత్రం లేవు… అందుకే అబద్ధాల మీద, అసత్యాల మీద సమయం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. గత పది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క మంచి కూడా గుర్తుకు రావడం లేదన్నారు. అబద్ధపు హామీల మీద ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకంటే గొప్ప పరిపాలన ఆశించలేమన్నారు, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులను ప్రారంభించింది అన్నారు. అయితే వీటికి భయపడేది లేదని కేటీఆర్ అన్నారు. సన్నవడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ హామీ బోగస్ గా మారిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మద్దతు ధర లేక రైతుబంధు లేక నష్టపోతున్న రైతన్నల తరఫున పోరాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన ప్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ డీల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పాలనలో జరిగుతున్న  పతనం నుంచి తెలంగాన కోలుకోవడం అసాద్యం

నాలుగు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం పోవడం ఖాయమని అయితే కొత్త ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేసిన నష్టం నుంచి తెరుకొని ముందుకు తీసుకుపోవడం అతిపెద్ద సవాలుగా మారుతుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక ప్రగతి పూర్తిగా పతనం అయిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయ వనరులు నుంచి మొదలుకొని వ్యవసాయ రంగం, అన్ని రంగాలు  తిరోగమనంలో ఉన్నాయన్నారు. నిరుద్యోగితక పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వదిలి వెళ్ళిపోతున్నాయన్నారు. ఈ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదన్నారు. కాంగ్రెస్ పాలన వలన జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడం అప్పుడప్పుడే సాధ్యం కాదు అన్నారు

ప్రజల పక్షాన కోట్లాడడమే ప్రస్తుత భాధ్యత

ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించడం పైన ప్రధానంగా దృష్టి సారించామని తెలిపిన కేటీఆర్, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుతో పాటు తీసుకున్న నిర్ణయాలలో పారదర్శకత పైన ప్రజల తరఫున కొట్లాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అప్పుడే బలమైన ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని రాజ్యాంగబద్ధంగా మార్చే అవకాశం ఉన్నదా అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మరో నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సిందే అన్నారు. అయితే ప్రజలు ఐదు సంవత్సరాల కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి అయిదు సంవత్సరాలు పూర్తికాలిక పదవిలో ఉంటారా లేదా ఓటుకు నోటు వలన బిజెపికి వెళ్తాడా అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజకీయాల్లో ఏదైనా జరుగుతుందని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే ఎప్పుడూ ఎలాంటి పరిణామైనా జరగవచ్చు అన్నారు

రాజకీయాల్లోకి కుటుంబాలను లాగడం నీచం

మేము అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో ఏనాడు ఇతరుల కుటుంబ సభ్యులను రాజకీయ అంశాల్లోకి లాగలేదన్నారు. దాదాపు రెండు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులను అవహేళన చేసి మాట్లాడినప్పుడు, రాజకీయాలు వదిలేయాలన్నంత భావోద్వేగానికి గురైన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కేవలం రాజకీయాల కోసం ఇతరుల కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతారో అర్ధంకాదని, ఈ విషయం తనకు అత్యంత బాధ కలిగిస్తుందన్నారు.

నీచమైన రాజకీయాల కోసం తన కుటుంబాన్ని లాగుతున్న ముఖ్యమంత్రి పైన, ఆయన వందిమాగదుల పైన ప్రజల మద్దతుతో పోరాటం చేస్తాను. రెేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వతా ఈ నీచమైన రాజకీయ సంస్కృతి అత్యంత హీనమైన దశలో రాష్ట్రం ఉన్నది . అయితే ఈ నీచమైన దశకూడా త్వరలో ముగిసిపోతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు.

Also Read:దీపావళి….తీసుకోవాల్సిన జాగ్రత్తలు

- Advertisement -