ఐపీఎల్ 2025 మెగా వేలంకు రంగం సిద్ధమైంది. వేలానికి ముందు అన్ని ప్రాంచైజీలు తమ రిటైన్ ఆటగాళ్ల లిస్ట్‌ను రిలీజ్ చేశాయి. ఢిల్లీ (రిషబ్ పంత్), లక్నో (కేఎల్ రాహుల్), కేకేఆర్ (శ్రేయస్ అయ్యర్), పంజాబ్ కింగ్స్ (శిఖర్ ధవన్), ఆర్సీబీ (ఫాఫ్ డుప్లెసిస్) తమ కెప్టెన్లను వేలానికి ఉంచాయి.
రిటెన్షన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు) అత్యధిక ధర దక్కించుకోగా ఆర్సీబీ విరాట్ కోహ్లీని రూ.21 కోట్లకు రిటైన్ చేసుకుంది. ముంబై… రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు), చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్క్యాప్డ్ ప్లేయర్‌గా (రూ.4 కోట్లు) అందుకోనున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్..పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు),అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు),నితీశ్ రెడ్డి (రూ.6 కోట్లు),ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్ల)కు దక్కించుకోగా కోల్‌కతా నైట్‌రైడర్స్…రింకు సింగ్ (రూ.13 కోట్లు),వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు),సునీల్ నరైన్ (రూ.12 కోట్లు),ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు),హర్షిత్ రాణా (రూ.4 కోట్లు),రమణ్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు) రిటైన్ చేసుకుంది.
ముంబయి ఇండియన్స్..జస్ప్రీత్ బుమ్రా(రూ.18 కోట్లు),సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు),హార్దిక్ పాండ్య (రూ.16.35 కోట్లు),తిలక్ వర్మ (రూ.8 కోట్లు) పలకగా చెన్నై సూపర్ కింగ్స్…రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు),మతిశ పతిరన (రూ.13 కోట్లు),
శివమ్ దూబె (రూ.12 కోట్లు),రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు),రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు… రజత్ పటిదార్ (రూ.11 కోట్లు),
యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)కు దక్కించుకుంది.
రాజస్థాన్ రాయల్స్…సంజు శాంసన్ (రూ.18 కోట్లు),యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు),రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు),ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు),హెట్మయర్ (రూ.11 కోట్లు),సందీప్ శర్మ (రూ.4 కోట్లు) పలకగా ఢిల్లీ క్యాపిటల్స్…అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు),
కుల్దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు),ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు),అభిషేక్ పొరెల్ (రూ.4 కోట్లు) పలికారు.
పంజాబ్ కింగ్స్..శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు),ప్రభ్‌సిమ్రన్ సింగ్ (రూ.4 కోట్లు) పలకగా గుజరాత్ టైటాన్స్…రషీద్ ఖాన్ (రూ.18 కోట్లు),శుభ్‌మన్ గిల్ (రూ.16.5 కోట్లు),సాయి సుదర్శన్ (రూ.8.5 కోట్లు),రాహుల్ తెవాతియా (రూ.4 కోట్లు),షారుక్ ఖాన్ (రూ.4 కోట్లు) పలికారు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్…నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు),రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు),మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు),మోసిన్ ఖాన్ (రూ.4 కోట్లు),ఆయుష్ బదోనీ (రూ.4 కోట్లు) పలికారు.
Also Read:దీపావళి….తీసుకోవాల్సిన జాగ్రత్తలు