తెలంగాణ బీసీ కమిషన్ బహిరంగ విచారణ రెండవ రోజు లో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో ఉదయం పదిగంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగింది. ఇందులో దాదాపుగా ఏడు నుండి ఎనిమిది వందల మంది వరకు పాల్గొనడం జరిగింది. వివిధ కుల సంఘాలు, మరియు రాజకీయ నాయకులు తమ తమ దరఖాస్తులను సమర్పించడం జరిగింది. బహిరంగ విచారణ లో నిజామాబాద్ రూరల్ శాశనసభ్యులు భూపతి రెడ్డి, జుక్కల్ శాశనసభ్యులు లక్మికాంతరావు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దన్, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కేశ వేణు లు పాల్గొని వారి సలహాలు, సూచనలు అందించడం జరిగింది.
జిల్లాల వారిగా అందిన దరఖాస్తులు..
నిజమాబాద్: 102,కామారెడ్డి: 26,మొత్తం 128 కి పైగా వినతులు, సలహాలు, సూచనలు అఫిడవిట్ రూపంలో కమిషన్ కి సమర్పించడం జరిగింది. ఈ వినతులలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ఏ, బి, సి, డి, ఇ గ్రూపుల వారీగా రిజర్వేషన్లను కల్పించాలని, మొత్తంగా బీసీ లకు జనాభా దామాషాలో రిజర్వేషన్లు కల్పించాలని విన్నవించడం జరిగింది. కొన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం లేనందు వారికి అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లతో పాటు వివిధ కుల సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను, వెనుకబాటుతనాన్ని కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా గ్రామాభివృద్ధి సంఘాల పేరుతో బీసీ కులాల వారిని గ్రామ బహిష్కరిస్తున్న అంశాన్ని కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. బహిరంగ విచారణ అనంతరం గాజులపేట్ లోని మేదర కులస్తుల జీవనవిధానాన్ని కమిషన్ ప్రత్యక్షంగా పరిశీలించింది.
బహిరంగ విచారణ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్, సభ్యులు, రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్ , బాలలక్ష్మీ రంగు, స్పెషల్ ఆఫీసర్ జి సతీష్ కుమార్ లతో పాటు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ అధికారి స్రవంతి, కామారెడ్డి జిల్లా అధికారులు అడిషనల్ కలెక్టర్ విక్టర్, జెడ్పీ సీఈఓ & డీబీసీడీఓ చందర్ మరియు ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది.
Also Read:KTR:ఆగిన విద్యుత్ ఛార్జీల పెంపు..బీఆర్ఎస్ విజయం