Harishrao:ఏక్ పోలీస్ విధానం ఏది?

1
- Advertisement -

తెలంగాణ స్పెషల్ పోలీసుల సమస్యలపై రేవంత్ రెడ్డి వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఎక్స్ వేదికగా స్పందించిన హరీశ్ రావు…తన వ్యక్తిగత భద్రత నుంచి తెలంగాణ స్పెషల్ పోలీసులను తప్పించడం అనాలోచిత నిర్ణయం. పదిహేడు వేల మంది స్పెషల్ పోలీసులను తన చర్యతో సీఎం అవమాన పరిచారు. తండ్రి కొడుకులను విశ్వాసంలోకి తీసుకోనట్లుగా ఉంది రేవంత్ రెడ్డి చర్య అన్నారు.

స్పెషల్ పోలీసులు అంటే రాష్ట్రానికి మిలిటరీ లాంటి వారు… వారి ఆత్మస్థైర్యాన్ని సీఎం దెబ్బతీయకూడదు. స్పెషల్ పోలీసుల సమస్యల పరిష్కారానికి సీఎం తక్షణమే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి, నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఏక్ పోలీస్ విధానాన్ని తీసుకురాబోతానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం ఇప్పుడు స్పెషల్ పోలీసుల ఆందోళనపై కనీసం స్పందించకపోవడం ఎంతవరకు సమంజసం? అన్నారు. సస్పెండ్, డిస్మిస్ అయిన స్పెషల్ పోలీసు కానిస్టేబుళ్లను తక్షణమే విధుల్లోకి చేర్చేందుకు సీఎం జోక్యం చేసుకోవాలన్నారు. స్పెషల్ పోలీసుల పై సచివాలయ ముఖ్య భద్రతా అధికారి ఎమర్జెన్సీ తరహాలో ఆంక్షలు పెడుతూ విడుదల చేసిన సర్క్యూలర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.

Also Read:Harishrao: తగ్గిన కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు

సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్‌లు చేసినా, ఆ పోలీసులు పట్ల చర్యలు ఉంటాయని పేర్కొనడం దుర్మార్గం అన్నారు. భావప్రకటన స్వేచ్ఛ అనే రాజ్యాంగ ప్రాథమిక హక్కును హరించే అధికారం ఎవరికీ లేదు అన్నారు.

- Advertisement -