ఏనుముల రేవంత్ రెడ్డి కాదు..ఎగవేతల రేవంత్ రెడ్డి!

0
- Advertisement -

వనపర్తి జిల్లా కేంద్రంలో రైతాంగ ప్రజా నిరసన సదస్సులో పాల్గొని మాట్లాడారు మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ ప్రభుత్వం మీద రైతుల ఆగ్రహం కి ఇది సంకేతం..పాత పథకాలు ఒక్కొక్కటి బంద్ పెడుతున్నాడు అన్నారు. బతుకమ్మ చీరలు, రైతు బంధు, కెసిఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, చేప పిల్లలు బంద్ అయ్యాయి..బి అర్ ఎస్ పోరాటం తో సర్కార్ దిగోస్తుందన్నారు.

వరంగల్ డిక్లరేషన్ అమలు కావట్లేదు..రాష్ట్రం లో దేవుని మీద ఓట్లు…. అడిగినోన్ని తిట్లు ఇది నడుస్తుందన్నారు. వై ఎస్, చంద్రబాబు లాంటి వాళ్ళ మీద పోరాడినం..రేవంత్ రెడ్డి ఓ లెక్కనా?, రుణమాఫీ చేయక పోతే వెంట పడ్డాము.. అడుగడుగునా నిలదీశాం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా, రాహుల్, ప్రియాంక తో చెప్పించాడు…పార్లమెంట్ ఎన్నికల్లో దేవుడి మీద ఓట్ల వేసి మాట తప్పాడు అన్నారు.

రుణమాఫీ కానీ లక్షలమంది ఉన్నారు…సగం మందికి కూడా రుణ మాఫీ కాలేదు అన్నారు. అనేక కోర్రిలతో రుణమాఫీ కాలేదు.ఆధార్ లేదని, పెండ్లి కాలేదని ఇలా రకరకాల కారణాలు…లోన్ ఇచ్చేటపుడు అడగని రేషన్ కార్డు… మాఫీ చేసేటపుడు ఎందుకు? అన్నారు. పాస్ బుక్ చూసి లోన్ ఇచ్చారు.. అప్పుడు లేని నిబంధన ఇప్పుడు ఎందుకు?, రాజు దేవుళ్ళని మోసం చేస్తే రాజ్యానికి అరిష్టం అన్నారు. ఈ ప్రజల కోసం దేవుని దగ్గరికి నేను పోయాను..పాపత్ముడిని క్షమించు.. ప్రజల్ని కాపాడమని దేవుడిని కోరుకున్నాను అన్నారు.

ఏనుముల రేవంత్ రెడ్డి కాదు… ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నారు. ఎగవేతల రేవంత్ రెడ్డి అని నిన్ను పిలుస్తాం..11 విడతల్లో 72,800 కోట్లు రైతు బంధు కెసిఆర్ ఇచ్చిండు అన్నారు. కరోనా టైం లో ఎంతగా ఇబ్బంది ఉన్న రైతు బంధు ఇచ్చింది కెసిఆర్…మూసి ప్రక్షాళన కు డబ్బులు ఉంటాయి.. రైతు భరోసా కి నిధులు వుండవు అన్నారు. రైతు బంధు ఇయ్యమన్న వీళ్ళను ఊరికిద్దామా.. ఉకుందామా?, లక్షా యాభై వేల కోట్లు రైతులకు కెసిఆర్ ఇచ్చిండు అన్నారు. వరి, పత్తి, శనిగలు, అన్ని పంటలకు బోనస్ అన్నాడు.బోనస్… బోగస్..వరి,పత్తి కొంటున్నారా? పత్తి రైతులు ధర్నా చేస్తున్నారు అన్నారు.

Also Read:Harishrao: తగ్గిన కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు

- Advertisement -