- Advertisement -
కేంద్రమంత్రి బండి సంజయ్కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బండి సంజయ్ బీజేపీ నాయకుడు అనే విషయాన్ని మర్చిపోయారు అన్నారు. రేవంత్ రెడ్డికి సహాయమంత్రిగా పని చేస్తున్నారు….కేటీఆర్ పైన బండి సంజయ్ అక్కసు వెళ్లగక్కుతున్నారు అన్నారు.
తెలంగాణలో బీజేపీ,కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయి….రేవంత్ రెడ్డిని కాపాడాలని బండి సంజయ్ ఉత్సాహపడుతున్నారు అన్నారు. బండి సంజయ్ చిల్లర మాటలు మానుకోవాలని…కరీంనగర్ లో కార్పోరేటర్ గా మాట్లాడుతున్నారు అన్నారు.
రేవంత్ రెడ్డి,బండి సంజయ్ మధ్య ఐఖ్యత ఎక్కడిది అన్నారు. డబ్బుల సంచులతో దొరికి రేవంత్ రెడ్డి,పేపర్లు లీక్ చేసిబండి సంజయ్ జైలుకు వెళ్లారు అన్నారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆక్సిజన్ తో నడుస్తోంది….మిలాఖత్ ఉంటే కేటీఆర్ బామ్మర్ధి ఇంటిపై రేవంత్ రెడ్డి ఎందుకు దాడి చేయిస్తారు అని ప్రశ్నించారు.
- Advertisement -