Harishrao: తగ్గిన కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు

2
- Advertisement -

రాష్ట్రంలో కొత్త కంపెనీల రిజిస్ట్రేష‌న్లు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా స్పందించిన హరీశ్‌ రావు.. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికను కోట్ చేస్తూ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పాల‌న‌లో కొత్త కంపెనీల రిజిస్ట్రేష‌న్లు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయాయ‌ని, ఇది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తెచ్చిన అస‌లైన మార్పు అని విమ‌ర్శించారు. 2023-24తో పోలిస్తే 2024-25 జూలై నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు తెలంగాణలో గణనీయంగా తగ్గినట్టు వెల్లడించింది. ఇది తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి గొడ్డలి పెట్టు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల తెలంగాణలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కోల్పోవడమే కాక ఆర్థిక అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు.

Also Read:Andhra Pradesh: దీపం పథకం బుకింగ్ ప్రారంభం

- Advertisement -