అడ్డగోలు సంపాదనపై ఉన్న మోజు.. పెద్దాసుపత్రుల ఆలన పాలనపై లేకపాయే అని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్…ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు వైద్య సేవలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆసుపత్రుల్లో మందుల కొరతపై లేకపాయే. పోలీసు ఉద్యోగాలు ఊడపీకడంపై ఉన్న మోజు.. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత పై లేకపాయే అని ప్రశ్నించారు. పైసలే ప్రామాణికమైన మీ పైసల పాలనలో అన్ని రంగాల్లో అవేదనలు, అవస్థలు, అన్యాయాలే కనబడుతున్నాయని మండిపడ్డారు.
అక్రమ కేసులపై ఉన్న మోజు – ఆరోగ్య శాఖపై లేకపాయే
అడ్డగోలు సంపాదన పై మోజు-పెద్దాసుపత్రుల ఆలన పాలన పై లేకపాయే
కుటిల రాజకీయాలపై ఉన్న మోజు – రోగుల కష్టాలపై లేకపాయే
ముళ్ల కంచెలపై ఉన్న మోజు – ఆసుపత్రుల్లో మందుల కొరతపై లేకపాయే
పోలీసు ఉద్యోగాలు ఊడపీకడంపై ఉన్న మోజు – ఆసుపత్రుల్లో… pic.twitter.com/KkWj9R0K3Z
— KTR (@KTRBRS) October 29, 2024
Also Read:Andhra Pradesh: దీపం పథకం బుకింగ్ ప్రారంభం