Kerala:బాణసంచా పేలుడు..150 మందికి గాయాలు

2
- Advertisement -

హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో క్రాకర్స్‌ అగ్నిప్రమాదం తర్వాత కేరళలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. కాసర్‌గోడ్‌లోని ఓ ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో బాణసంచా పేలుడు ప్రమాదంలో 150 మందికి పైగా గాయపడ్డారు.

ఆలయం సమీపంలో నిల్వ ఉన్న బాణసంచా పేలడంతో మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో 150 మందికిపైగా గాయపడగా 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కాసరగోడ్‌, కన్నూర్‌, మంగళూరులోని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నట్లు తెలిపారు.

భద్రతా రాహిత్యం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. బాణసంచా నిల్వ ఉన్న ప్రాంతానికి కనీసం 100 మీటర్ల దూరంలో క్రాకర్లు కాల్చాలనే నిబంధనలు పాటించలేదు…ఘటనా స్థలంలో నమూనాలు సేకరించి కేసు నమోదు చేశాం అని తెలిపారు.

- Advertisement -