అక్రమ కాలేజీల చర్యలు తీసుకోండి: గెల్లు

1
- Advertisement -

బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. అమృత కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు ఇచ్చిన వారిపైన చర్యలు తీసుకోవాలని పారా మెడికల్ బోర్డు సెక్రటరీ ప్రేమ్ కుమార్ కి వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్బంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పారా మెడికల్ డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్ పేరు మీద అడ్మిషన్లు తీసుకొని విద్యార్థులను మోసం చేస్తున్నారని, ఈ విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు నష్టపోకుండా చూడాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల నుండి అక్రమంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి ఇవ్వాలని, అక్రమ కాలేజీలపై నిఘా పెట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, నాయకులు ఖుర్రం అలీ, వికాస్, ప్రవీణ్, సాయితేజ, సాయి పటేల్, వంశీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:ప్రజా పాలన అంటే.. ఇదేనా రేవంత్ రెడ్డి?

- Advertisement -