ఏపీలో పెట్టుబడులు పెట్టండి: నారా లోకేష్

0
- Advertisement -

అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు ఏపీ మంత్రి నారా లోకేశ్. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను పారిశ్రామిక వేత్తలకు వివరించారు.

పరిపాలనలో AI వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యతతో కూడిన మానవవనరులను అందించడానికి, తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు విద్యారంగంలో కూడా సంస్కరణలకు శ్రీకారం చుట్టాం” అని పారిశ్రామిక వేత్తలకు తెలిపారు లోకేశ్.

విభజిత ఆంధ్రప్రదేశ్ లో మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ద్వారా పేదరిక నిర్మూలనకు విజనరీ సిఎం చంద్రబాబునాయుడు సరికొత్త పి-4 విధానం ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రతి వందరోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నాం అని వెల్లడించారు.

Also Read:KTR:బోనస్ దేవుడెరుగు…మద్దతు ధరకే దిక్కులేదు

- Advertisement -