తీరం దాటిన ‘దానా’ తుపాను

5
- Advertisement -

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను దానా తీరం దాటింది. ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలోని భితర్కానిక జాతీయ పార్క్, భద్రక్ జిల్లాలోని దామ్రా మధ్య శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది.

తీరం దాటే సమయంలో దానా బీభత్సం సృష్టించింది. గంటకు 120 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయగా పలుచోట్ల చెట్లు నేలకూలాయి. తుపాను కారణంగా ఒడిశాలోని 16 జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపించగా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. తీ ముఖ్యంగా ఒడిశాలో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ఏపీలో ఉత్తరాంధ్ర ఓడరేవులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు.

Also Read:మహేష్‌ – రాజమౌళి మూవీ..క్రేజీ అప్‌డేట్!

- Advertisement -