మహేష్‌ – రాజమౌళి మూవీ..క్రేజీ అప్‌డేట్!

2
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో గ్లోబ్ ట్రోటింగ్ మూవీగా ” SSMB29 ” రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్న ట్లు తెలుస్తోంది. కనీ విని ఎరుగని రీతిలో యాక్షన్ అడ్వంచర్ మూవీగా రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నాడు. అయితే మహేష్ బాబు తో చేస్తున్న ఈ మూవీ విషయంలో రాజమౌళి తన స్టైల్ కు భిన్నంగా కొత్తగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు సినిమా కోసం షూటింగ్ ప్రాసెస్‌ని రివర్స్ చేశారు రాజమౌళి. ఈసారి ముందు విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేసి.. తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారు రాజమౌళి.

ఇప్పటికే 40శాతం వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయిందని సమాచారం…దీన్ని బట్టి ఈ సినిమా రాజమౌళి గత చిత్రాల్లా కాకుండా.. త్వరగానే పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

Also Read:భద్రాద్రి రామయ్య సన్నిధిలో గవర్నర్

- Advertisement -