Bigg Boss 8 Telugu: నిన్న నిఖిల్‌తో నేడు గౌతమ్‌తో!

4
- Advertisement -

బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 8 వారాలు పూర్తి చేసుకోవడానికి వచ్చింది. ఇక తాజా ఎపిసోడ్‌లో భాగంగా యష్మీ తనలోని మరో యాంగిల్‌ని బయటపెట్టింది. మొన్న ఎపిసోడ్‌లో నిఖిల్‌కు ముద్దు ఇచ్చిన యష్మీ…తాజాగా గౌతమ్‌తో ప్రేమాయణం నడిపింది.

తాజా ఎపిసోడ్‌లో జరిగిన రెండు టాస్కుల్లోనూ ఓజీ క్లాన్‌యే గెలిచింది. దీంతో రాయల్స్ క్లాన్ తాము చేసిన తప్పులేంటి, ఎలా ఆడాలి అనే విషయాలు చర్చించేందకు ఓ మీటింగ్ పెట్టుకున్నారు. హరితేజ-నయనిలను కలిపేందుకుప్రయత్నించాడు గౌతమ్. మీటింగ్ సీరియస్‌గా జరుగుతుండగా నబీల్‌ను వెంటపెట్టుకొని యష్మీ అక్కడికి వచ్చింది.

నీకు ఆకలి అవుతుందా.. ఎవరో తినిపిస్తా అన్నారుగా పో అంటూ యష్మీతో అన్నాడు నబీల్. ఇది విని మా క్లాన్‌లో ఎవరో నీకు తినిపిస్తా అన్నారా ఎవరది అంటూ రాయల్స్ అనుకున్నారు. ఇంకేముంది మెగా చీఫ్ గౌతమ్ వెంటనే లేచి నిల్చొని నడు పోదాం అంటూ బయలుదేరాడు. ఇది చూసిన రాయల్స్ క్లాన్ సభ్యులు అవాక్కయ్యారు.

Also Read:హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. నీటి సరఫరా బంద్

గంగవ్వ అయితే అలాగెలా తినిపిస్తావ్.. అంటూ గౌతమ్‌ను అడిగింది. దీనికి తినిపించను అవ్వా తినేసి వస్తా అంటూ నెమ్మదిగా సైడ్ అవ్వబోయాడు గౌతమ్. మరోవైవు అవినాష్ నేను తినిపిస్తా అంటూ యష్మీ వెంటపడ్డాడు. ఇది చూసి యష్మీ నవ్వుతూ నాకెవరు తినిపిస్తా అన్నారో వాడొస్తాడు అంటూ ముందుకెళ్లిపోయింది. వెంటనే గౌతమ్ వెళ్లడంతో మిగితా సభ్యులు నవ్వుకున్నారు.

- Advertisement -