బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 8 వారాలు పూర్తి చేసుకోవడానికి వచ్చింది. ఇక 8వ వారంలో భాగంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది గంగవ్వ.
తాజా ఎపిసోడ్‌లో భాగంగా అందరూ పడుకున్న సమయంలో గంగవ్వ లివింగ్ రూమ్‌లోని సోఫా మీద కూర్చోని పెద్ద పెద్దగా అరుస్తూ దయ్యం పట్టినట్లుగా ఊగిపోయింది. దీంతో కంటెస్టెంట్లు హడావిడిగా వచ్చి గంగవ్వను చూసి తెగ టెన్షన్ పడిపోయారు. ముఖ్యంగా నయ స్టోర్ రూమ్ కెమెరా ప్లీజ్ రెస్పాండ్ అంటూ ఆందోళన చెందింది. చివరగా చిన్నగా బెడ్ రూమ్‌లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. తీరా సీన్ కట్ చేస్తే ఇది ప్రాంక్ అని వీడియోలో చెప్పారు.
టేస్టీ తేజ, అవినాష్ కు మాత్రమే ఈ విషయం తెలుసు. మిగితా హౌజ్‌మేట్స్ కి తెలియక పోవడంతో తెగ భయపడిపోయారు.
Also Read:Bigg Boss 8 Telugu: హరితేజను సేవ్ చేసిన గౌతమ్