Bigg Boss 8 Telugu: హరితేజను సేవ్ చేసిన గౌతమ్

3
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 8వవ వారం పూర్తి చేసుకోవడానికి వచ్చింది. ఎనమిదో వారం నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగగా చివరకు ఆరుగురు నిఖిల్,విష్ణుప్రియ,పృథ్వీ,మెహబూబ్,ప్రేరణ,నయనిలలో ఒకరు ఇంటి నుండి బయటకు రానున్నారు. ఈవారం అత్యధికంగా నిఖిల్‌కు నామినేషన్స్ పడటం విశేషం.

నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా మెహబూబ్‌కి అవకాశం రాగానే హరితేజ ఫస్ట్, సెకండ్ నయనిని నామినేట్ చేశాడు. మీరు ఒకటి చెబుతారు.. ఒకటి చేస్తారు.. అందరిలో మంచిగా ఉండాలి అనే ప్రాసెస్‌లో మాటలు ఛేంజ్ చేస్తుంటారు అని హరితేజ నామినేషన్ సందర్భంగా రీజన్ చెప్పగా ఛార్జింగ్ టాస్కులో నేను దొంగతనంగా పాయింట్ తెచ్చుకున్నాను.. అలానే మిగిలినవాళ్లు కూడా వాళ్ల వాళ్ల టాలెంట్ చూపించి పాయింట్లు తెచ్చుకున్నారు.. మరి నువ్వు ఏం చేశావ్ అంటూ నయనిని ప్రశ్నించాడుజ

తర్వాత ప్రేరణ మొదటిగా విష్ణుప్రియను, రెండో నామినేషన్ పృథ్వీకి వేసింది. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ నీ గురించి నువ్వు చెప్పుకునేది ఒకటి.. చేసేది ఒకటి.. అందుకే నైనిక వెళ్లేటప్పుడు నిన్ను ఫేక్ ఫ్రెండ్ అని చెప్పింది అని రీజన్ చెప్పింది. దీనికి నువ్వు ఒకసారి నబీల్ చెంప పగలగొట్టాలని ఉంది అన్నావ్ కదా.. అది ఎలా అంటావ్ అంటూ విష్ణు అడిగింది. అవును అన్నా.. అది కోపంలో అన్నా.. మధ్యలో ఇది ఎందుకొచ్చింది అంటూ ప్రేరణ అంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వు రివెంజ్ నామినేషన్ వేస్తావ్.. అది నీకు అలవాటు అంటూ పృథ్వీని నామినేట్ చేస్తూ రీజన్ చెప్పింది ప్రేరణ.

ఇక గంగవ్వ తన ఫస్ట్ నామినేషన్ నిఖిల్‌కి వేసింది. నువ్వు గొంతు చించుకొని అరిచి, సామాన్ల మీద అది దూకినవ్.. అది నాకు నచ్చలే అని చెప్పగా తన రెండో నామినేషన్ విష్ణుప్రియకి వేసింది గంగవ్వ. ఊరికే ఉండు అటు పో అని నన్ను అన్నావ్.. నువ్వు అలా అనడం నాకు నచ్చలేదు అని చెప్పింది. నిఖిల్ మొదటిగా మెహబూబ్‌ను నామినేట్ చేస్తూ… నీ ఆట బావుంటుంది.. కానీ ఛార్జింగ్ టాస్కులో ప్రామిస్ చేసుకున్నాం.. దొంగతనం చేయరు అని.. కానీ చేశారు అని చెప్పగా రెండో నామినేట్ నయనిని చేశాడు నిఖిల్.

Also Read:కలబందతో..నిగారింపు సొంతం!

మొత్తంగా నామినేషన్స్ పూర్తయ్యే సరికి నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, మెహబూబ్, ప్రేరణ, హరితేజ, నయని ఉండగా నామినేట్ అయిన సభ్యుల్లో నుంచి ఒకరిని సేవ్ చేయొచ్చు అంటూ మెగా చీఫ్ గౌతమ్‌కి ఆఫర్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో హరితేజను సేవ్ చేశాడు గౌతమ్.

- Advertisement -