ఏఈవోల సస్పెండ్‌పై మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, దేవిప్రసాద్. డిజిటల్ క్రాప్ సర్వేకు ఒప్పుకోలేదని ఏఈవోలపై వేటు వేయడం అప్రజాస్వామికం.. బెదిరించడం, ఉద్యోగులను విభజించడమే ప్రజాపాలననా? అని ప్రశ్నించారు.
పక్క రాష్ట్రాల్లో ఏజెన్సీలు, ఇతర శాఖలతో డిజిటల్ క్రాప్ సర్వే చేపడుతుంటే ఇక్కడ ఏఈవోల నెత్తిన రుద్దడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.ఇప్పటికే 49 రకాల విధులు నిర్వర్తిస్తున్న వారిపై అదనపు భారం మోపవద్దు.. డిజిటల్ సర్వేను ఏజెన్సీలకు అప్పగించాలన్నారు నిరంజన్ రెడ్డి .
డిజిటల్ క్రాప్ సర్వే పేరిట ప్రభుత్వం ఏఈవోలను వేధించడం అన్యాయం.. ఒకేసారి ఇంతమందిపై వేటు వేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల మాజీ చైర్మన్ దేవిప్రసాద్. ఇప్పటికైనా ఏఈవోలను చర్చలకు పిలువాలి… బేషరతుగా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి అని డిమాండ్ చేశారు.
Also Read:KTR: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటిస్