KTR: విద్యుత్ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ పోరాటం

0
- Advertisement -

విద్యుత్ ధరల పెంపుదల ప్రతిపాదనను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్‌తో మాజీ ఇంధన శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు శాసనసభ్యుల ప్రతినిధి బృందం సమావేశమైందని తెలిపారు.

వచ్చే 3 రోజులలో జరిగే బహిరంగ విచారణలలో మా అభిప్రాయాలను తెలియజేస్తామన్నారు. 23న హైదరాబాద్‌లో శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి , నిజామాబాద్‌లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి,సిరిసిల్లలో నేను, మాజీ ఎంపీ వినోద్ కుమార్ , ఎమ్మెల్సీ ఎల్.రమణ బహిరంగ విచారణకు హాజరవుతారని తెలిపారు కేటీఆర్.

- Advertisement -