బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 47 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో మెగా చీఫ్‌గా ఎన్నికయ్యారు గౌతమ్. తొలుత ఇవాళ్టి ఎపిసోడ్‌లో రాయల్-ఓజీ క్లాన్స్‌కి మధ్య ఓ టాస్క్ జరిగింది. ఈ టాస్కులో గెలవాలంటే ప్లాజ్మాలో చూపించన బొమ్మలు ఏ తలగడ (దిండు)పై ఉందో వెతికి దాన్ని తీసుకొని ముందుగా బాక్స్‌లోకి వెళ్లాలి..ఈ టాస్కులో సరైన కుషన్‌ను తీసుకెళ్లే సభ్యుడిని బాక్స్‌లోకి వెళ్లే ముందు వరకూ ఆపొచ్చు.. తప్పు కుషన్ తీసుకెళితే మళ్లీ వెళ్లి తీసుకురావచ్చు అని చెప్పాడు బిగ్ బాస్. ఏ రౌండ్‌లో ఎంతమంది ఆడాలన్నది బిగ్ బాస్ నిర్ణయమని చెప్పగా ఈ టాస్కులో రాయల్ క్లాన్ గెలిచింది. రాయల్స్ గెలవడంతో ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ నుంచి ఇద్దరి సభ్యుల్ని తొలగించండి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. చివరకు నిఖిల్-నబీల్ ఇద్దరినీ తీసేయగా మిగిలింది అమ్మాయిలు, మణికంఠ.
టాస్కు ముగిసే సమయానికి ఔట్ కాకుండా ఉన్న విష్ణుప్రియ, యష్మీ, మణికంఠ, ప్రేరణ, అవినాష్, గౌతమ్, నయని, హరితేజ, మెహబూబ్, గౌతమ్, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ మెగా చీఫ్ కంటెండర్స్‌గా ఎంపికయ్యారు అని చెప్పాడు బిగ్ బాస్. మెగా చీఫ్ టాస్క్ లో భాగంగా పట్టుకో లేదా తప్పుకో అనే పోటీ పెట్టగా సర్కిల్‌లో ఉన్న బోన్ (ఎముక బొక్క)ను ముందుగా పట్టుకొన్న వాళ్లు మెగా చీఫ్ పదవికి అర్హత లేని వారిని తప్పించొచ్చు అని చెప్పి ఈ టాస్కుకి నిఖిల్‌ని సంచాలక్‌గా వ్యవహరిస్తాడని చెప్పాడు బిగ్‌బాస్.
బజర్ మోగిన వెంటనే అందరూ బోన్ దక్కించుకోవడం పోటీ పడగా చివరికి మెహబూబ్-గౌతమ్ మిగలగా వీరిద్దరి మధ్య పెనుగులాటలో గౌతమ్ చేతికి దక్కింది బోన్. దీంతో మెహబూబ్- అవినాష్‌ను గేమ్ నుంచి తప్పిస్తున్నట్లు గౌతమ్ అనౌన్స్ చేశాడు. మళ్లీ గౌతమ్ చేతికే బోన్ దక్కడంతో యష్మీ- నయనిలను ఔట్ చేశాడు. తర్వాత బోన్ మణికంఠ చేతికి చిక్కగా టేస్టీతేజ-హరితేజను తీసేస్తున్నా అని చెప్పాడు. చివరిగా గంగవ్వ -గౌతమ్ మిగలగా గౌతమ్ గెలిచాడు. దీంతో మెగా చీఫ్ కోసం తెప్పించిన కొత్త బ్యాండ్‌ను గౌతమ్ చేతికి కట్టాడు మెహబూబ్.
Also Read:“తల్లి మనసు” ..డబ్బింగ్ పూర్తి