లక్కీ భాస్కర్..ట్రైలర్ డేట్ ఫిక్స్!

2
- Advertisement -

వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

Also Read:షర్మిల..పోస్టు కార్డుల ఉద్యమం

తాజాగా‘లక్కీ భాస్కర్’ ట్రైలర్‌ రిలీజ్ డేట్ లాక్ అయింది. అక్టోబర్ 21న ట్రైలర్‌ని రిలీజ్ చేస్తున్నామని.. ఈ ట్రైలర్ అందరికీ నచ్చే విధంగా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు.

- Advertisement -