KTR: పోరాటం బీఆర్ఎస్‌కు కొత్త కాదు

3
- Advertisement -

పోరాటం బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో BRSV రాష్ట్ర సదస్సులో మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి ( టీఆర్ఎస్ ) తెలంగాణ రాష్ట్రం కోసమే ఆవిర్భవించిన పార్టీ అన్నారు.పోరాటం మనేది బిఆర్ఎస్ పార్టీకి కొత్త ఏం కాదు….రాజశేఖర్ రెడ్డి, చంద్ర బాబు నాయుడు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం, రేవంత్ రెడ్డి ఎంత? అన్నారు.

నదులు ఎక్కడ ఉన్నాయో, విప్రో ఛైర్మెన్ ఎవరు తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి… అలాంటి వ్యక్తీ మనకి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యం అన్నారు. భారత దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రం తెలంగాణ..ఎందరో విద్యార్ధి అమర వీరుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము…ఇవ్వాల రాష్ట్రంలో ఏ వర్గం వారికి కష్టం వచ్చిన తెలంగాణ భవన్ హక్కున చేర్చుకుంటుంది..వారికి అండగా ఉంటుందన్నారు.

జివో 29 వల్ల గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు…గ్రూప్ 1 అభ్యర్థుల కోసం అశోక్ నగర్ పోదామని అనుకుంటే అశోక్ నగర్ చుట్టు పోలీసుల ఉన్నారు…గ్రూప్ 1అభ్యర్థులే తెలంగాణ భవన్ కు వచ్చారు… వారికి అండగా బిఆర్ఎస్ ఉంటుందన్నారు.రైతు బంధు, రుణమాఫి ఊసే లేదు…రేవంత్ రెడ్డి ఢిల్లికీ మూటలు తీసుకోని పోతుండు… ఇప్పటి వరకు 25 సార్లు ఢిల్లి పోయిన వ్యక్తీ రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read:కొండా కామెంట్స్‌పై మళ్లీ స్పందించిన సమంత!

- Advertisement -