Bigg Boss 8 Telugu: సినిమా చూడకండా అవినాష్ రివ్యూ.. హరితేజకి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. నామినేషన్స్‌ నా సామిరంగ

2
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 7 వారం పూర్తి చేసుకోవడానికి వస్తోంది. ఇక ఏడోవారం నామినేషన్స్‌లో గౌతమ్ ,పృథ్వీ, నిఖిల్, మణికంఠ, యష్మీ,తేజ, ప్రేరణ,నబీల్,హరితేజ నిలిచారు.

తొలుత పృథ్వీ తనకి ఛాన్స్ రాగానే అవినాష్‌ని నామినేట్ చేశాడు . లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేస్తూ నేను కేవలం రెండు టాస్కుల్లోనే కనిపించానని అవినాష్ చెప్పాడు అది నచ్చలేదని రీజన్ చెప్పాడు. దీనికి డిఫెండ్ చేసుకునే క్రమంలో పుసుక్కున నిజం చెప్పేశాడు అవినాష్.ఈ క్రమంలో పృథ్వీ- అవినాష్‌కు గొడవ జరిగింది.

ఈ క్రమంలో ఇద్దరూ కొట్టుకునేలా మీదమీదకి రావడంతో నిఖిల్ సహా అందరూ ఆపారు. కాసేపటికి నీ పాయింట్లు నాకు నచ్చలేదు.. నేను యాక్సెప్ట్ చేయడం లేదు నీ నామినేషన్ అంటూ అవినాష్ అన్నాడు. దీనికి అక్కర్లేదురా నేను చేశా అంటూ పృథ్వీ మళ్లీ రెచ్చగొట్టాడు. ఇక తర్వాత నయని.. విష్ణుప్రియను నామినేట్ చేసింది. సెకండ్ నామినేషన్‌గా అవినాష్‌ను నామినేట్ చేస్తున్నా అంటూ హరితేజ చెప్పింది..

ALso Read:ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్ స్థలాలు..వివరాలు ఇలా తెలుసుకోండి!

మనం ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి పెద్ద షోకి వచ్చినప్పుడు ఎపిసోడ్స్ చూసి రావడం కరెక్ట్.. నేను ఒకేసారి 10 ఎపిసోడ్స్ చూశా అంటూ హరితేజ చెప్పింది. దీంతో అవినాష్ ఒక కొశ్చన్ వేశాడు. మీరు 10 ఎపిసోడ్స్ చూశారన్నారు కదా.. మీరు లాస్ట్ వీక్ పృథ్వీని నామినేట్ చేశారు.. సో ఆయన ఇప్పటివరకూ ఏ టాస్కులు ఆడాడు చెప్పండి అని చెప్పగా హరితేజ తడబడింది.

తర్వాత ఈ వారం ఇంటి నుంచి బయటికి పంపడానికి నామినేట్ అయిన సభ్యులు పేర్లు చదివి రాయల్స్ దగ్గర ఇమ్యూనిటీ షీల్డ్ ఉందని చెప్పాడు. దీని ద్వారా నామినేషన్స్‌లో ఉన్న వారిని ఒకరిని సేవ్ చేయొచ్చు కానీ దానికి బదులుగా మీరు ఒకరిని స్వాప్ చేయాలి అని చెప్పాడు. దీంతో అవినాష్ ఆ పవర్‌తో తనని సేవ్ చేసుకొని ఆ ప్లేస్‌లో హరితేజను స్వాప్ చేశాడు.

- Advertisement -