- Advertisement -
తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారులు ఏపీ లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాట, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ప్రశాంతి ఏపీలో రిపోర్టు చేయనున్నారు. అలాగే ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష, అభిషేక్ మొహంతి కూడా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
అయితే వీరంతా తమకు తెలంగాణ కేడర్ కావాలని గతంలో కేంద్రానికి అభ్కర్థనలు పంపారు. అయితే ఈ అభ్యర్థనలను తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం..సొంత రాష్ట్రాలకు వెళ్లి రిపోర్టు చేయాలని ఆదేశించింది. అలాగే తెలంగాణ నుంచి రిలీవ్ చేసింది.
- Advertisement -