Bigg Boss 8 Telugu: దసరా విజేతలకి నాగ్ బంపర్ ఆఫర్

4
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా ఆరో వారం పూర్తి చేసుకుంది. ఇక దసరా ఎపిసోడ్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది.సెలబ్రెటీలతో ఆట పాటలు, కంటెస్టెంట్లకి టాస్కులతో హోరెత్తించారు నాగార్జున. విజయదశమి సందర్భంగా కంటెస్టెంట్లతో బతుకమ్మ ఆడించి అలరించారు. ఫరియా అబ్దుల్లా, అమృత అయ్యర్, డింపుల్ హయాతి ఇలా ముగ్గురు ముద్దుగుమ్మలు తమ డ్యాన్సులతో మత్తెక్కించే పెర్ఫామెన్సులు ఇచ్చారు.

ఆ తర్వాత లడ్డూ కావాలా నాయనా అంటూ ఓ టాస్కు పెట్టారు. ఇందులో భాగంగా ఇరు క్లాన్‌లు తమ సభ్యుడికి స్పూన్‌లో లడ్డును పెట్టి అలానే తినిపించాలి. ఇచ్చిన టైమ్‌లో ఎవరైతే ఎక్కువ లడ్డూలు తినిపిస్తారో వాళ్లు విజేతలు అని చెప్పగా ఇందులో ఓజీ క్లాన్ గెలిచింది. తర్వాత ట్యూన్ వస్తుంది దానికి పాట గెస్ చేసే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో రాయల్స్ క్లాన్ విజేతగా గెలిచింది.

తర్వాత శ్రీను వైట్ల-గోపీచంద్ తమ కొత్త సినిమా విశ్వం ప్రమోషన్స్ లో భాగంగా అలరించారు. సెలబ్రెటీలతో ఇంటి సభ్యులకు ‘ఉప్పు మూట’ టాస్కు పెట్టగా రాయల్స్ గెలిచారు. చివరిగా ఆర్మ్ రెజ్లింగ్ పెట్టారు నాగార్జున. ఈ టాస్కు జరుగుతున్నంత అంతా నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ టాస్కులో కూడా రాయల్ క్లాన్ విజేతగా నిలవడంతో వారికి స్వీట్స్‌తో పాటు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు నాగార్జున. దసరా ఈవెంట్ గెలుచుకున్నందుకు రాయల్స్‌ క్లాన్‌కి ‘చీఫ్ కంటెండర్’ ట్రోఫీ ఇచ్చారు. అంటే తరువాతి వారం చీఫ్ అయ్యేందుకు రాయల్స్ టీమ్ నుంచే కంటెండర్లు ఉంటారని చెప్పారు. మొత్తంగా దసరా రోజు ఇంటి సభ్యులు తెగ ఎంజాయ్ చేశారు.

Also Read:పెళ్లిళ్ల సీజన్ షురూ..

- Advertisement -